విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

● కలెక్టర్‌ రాజర్షి షా ● అంతరిక్ష ప్రయోగశాల ప్రారంభం

ఆదిలాబాద్‌టౌన్‌/ఆదిలాబాద్‌రూరల్‌: విద్యార్థులు విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి పెంచుకుని శాస్త్రవేత్తలుగా ఎ దగాలని కలెక్టర్‌ రాజర్షిషా సూచించారు. బుధవా రం ఆదిలాబాద్‌రూరల్‌ మండలంలోని బంగారిగూ డ కేజీబీవీలో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులతో తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం, నవార్స్‌ ఎడ్యుటెక్‌ సహకారంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఖగోళ, అంతరిక్ష ప్ర యోగశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఈ ప్రయోగశాల విద్యార్థుల్లో జిజ్ఞాసను పెంచి భవి ష్యత్‌లో వారు అంతరిక్ష శాస్త్రవేత్తలుగా, స్పేస్‌ స్టార్టప్‌లు ప్రారంభించే స్థాయికి ఎదగడానికి ప్రేరణని స్తుందని తెలిపారు. ఇది జాతీయ విద్యా విధానంలో ముఖ్య భాగమని వివరించారు. గతంలో బిర్లా ప్లానిటోరియం లాంటి ప్రదేశాల్లోనే ఇలాంటి సౌకర్యాలుండేవని, ఇప్పుడు పాఠశాల స్థాయిలోనే వి ద్యార్థులకు ప్రయోగాత్మక విద్య అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్థులు ఇన్నోవేటివ్‌ ఆలోచనలతో ముందుకు వస్తే తె లంగాణ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌, వీ హబ్‌ లాంటి వేదిక ల ద్వారా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలి పారు. అనంతరం పట్టణ కేజీబీవీలో ఖగోళ, అంతరిక్ష ప్రయోగశాలతో పాటు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు అధికారులతో కలిసి పా ఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. అవసరమైన మరమ్మతులు, మౌలిక వసతులపై చర్చించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో రాజేశ్వర్‌, ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి డా క్టర్‌ మృణాల్‌ జైవంత్‌, టీడీఎఫ్‌ ప్రతినిధులు రాజేశ్వర్‌రెడ్డి, వినీల్‌రెడ్డి, నవార్స్‌ ఎడ్యుటెక్‌ ప్రతినిధులు శశాంక కూన, అరుణ్‌, తహసీల్దార్లు శ్రీనివాస్‌, గో వింద్‌, సెక్టోరల్‌ అధికారి ప్రత్యూష, ప్రత్యేకాధికారులు కవిత, దీప్తి, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

విత్తన కొరత రానివ్వొద్దు

కైలాస్‌నగర్‌: ఖరీఫ్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు, విత్తన కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. డీలర్లు నిబంధనలు పాటించాలని, రైతులను మోసం చేస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలో రైతులకు అవగాహన కల్పించాల ని సూచించారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, రెవెన్యూ అడిషనల్‌ కలెక్టర్‌ ఆర్‌ఎస్‌.చిత్రు, ఆర్డీవో జగదీశ్వర్‌రావ్‌, జేఏవో శ్రీధర్‌స్వామి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement