ఉన్నతస్థాయికి ఎదిగేలా చూడాలి | - | Sakshi
Sakshi News home page

ఉన్నతస్థాయికి ఎదిగేలా చూడాలి

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

ఇంద్రవెల్లి: విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదిగేలా కృషి చేయాలని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ సూ చించారు. మండలకేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు రవీంద్రాచారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీంద్రచారి దంపతులను శాలువాలతో సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాట లు వేసేది ఉపాధ్యాయులేనని, ఆ దిశగా ఉపాధ్యాయులు వృతి ధర్మంలో విధులు నిర్వహించి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేవిధంగా కృషి చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు రవీందర్‌రెడ్డి, సర్పంచులు మెస్రం తుకారాం, లఖన్‌, రాజేశ్వర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement