సాత్నాల: భోరజ్ మండలం సావాపూర్ గ్రామ స మీపాన కొరాటా–చనాకా, డీఎల్ 17 కెనాల్ నిర్మాణానికి అధికారులు భూ సేకరణ చేపట్టిన నేపథ్యంలో స్థానిక రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రా మంలో సమావేశమైన రైతులు జీపీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వందేళ్లుగా తమ కుటుంబాలు పూర్తిగా వ్య వసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు తెలి పారు. సారవంతమైన భూములు కోల్పోతే కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని వాపోయారు. తమకు సాగు భూములే జీవనాధారమని, 20 ఏళ్లుగా సాత్నాల ప్రాజెక్ట్ ద్వారా నీరు పుష్కలంగా అందుతోందని, బోరు బావుల్లోనూ నీరుంటుందని తె లిపారు. నీటి వసతుల్లేని భూముల వైపు కెనాల్‌ను మళ్లించి వారికి సాగునీరు అందించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కెనాల్ నిర్మాణానికి భూములిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. శ్రీనివాస్, సల్ల శీ ను, పబ్బత్ సంజీవ్, బోయర్ కవీశ్వర్, మార్చెట్టి నా గేశ్, సునీల్, వానికర్ బుద్ధప్రకాశ్ పాల్గొన్నారు.


