సాత్నాల: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాద వ్ హామీ ఇచ్చారు. భోరజ్ మండలం సావాపూ ర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన ‘ఇందిరమ్మ’ గృహప్రవేశాలకు హాజరయ్యారు. లబ్ధి దారులకు శుభాకాంక్షలు తెలిపి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవారి సొంతింటి కల నెరవేరుస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రతీ పేదవారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షు డు దీపక్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్‌రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్‌ఖాన్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శాంతన్‌రావు, టీటీడీ బోర్డు మాజీ మెంబర్ బెజ్జంకి అనిల్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు మల్యాల కరుణాకర్, ధర్మపురి చంద్రశేఖర్, మామిడి మల్లారెడ్డి, భూమారెడ్డి, ఉషమల్ల శంకర్, ఆడే జైపాల్, పొట్టు అశోక్, రాదేశ్యాం తదితరులు పాల్గొన్నారు.


