సమ్మె బాటలో.. | - | Sakshi
Sakshi News home page

సమ్మె బాటలో..

Apr 22 2026 7:24 AM | Updated on Apr 22 2026 7:24 AM

● నేటి నుంచి ఆర్టీసీ కార్మికుల విధుల బహిష్కరణ ● బస్సుల నిలిపివేతతో ప్రజారవాణాకు ఆటంకం

రీజియన్‌ పరిధిలో బస్సుల వివరాలు..

లహరి ఏసీ సీటర్‌/స్లీపర్‌ : 12

లహరి నాన్‌ ఏసీ సీటర్‌/స్లీపర్‌ : 14

రాజధాని : 11

సూపర్‌ లగ్జరీ : 95

సెమీ డీలక్స్‌ : 3

ఎక్స్‌ప్రెస్‌ : 44

ప్రైవేట్‌ ఎక్స్‌ప్రెస్‌ : 83

పల్లెవెలుగు : 167

ప్రైవేట్‌ పల్లెవెలుగు : 212

ఆదిలాబాద్‌: సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉ ద్యోగులు సమ్మె బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యంతో మంగళవారం రాత్రి వరకు జరిపి న చర్చలు విఫలం కావడంతో ఆందోళనకే సై అ న్నారు. నేటి ఉదయం నుంచి బస్సులు డిపోలకే పరిమితం కానుండగా.. ప్రజారవాణా వ్యవస్థకు ఆటంకం కలగనుంది. ప్రయాణికులకు ఇబ్బందులతో పాటు, సంస్థ ఆదాయానికి సైతం భారీగా గండిపడే అవకాశం ఉంది.

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో సర్దుబాటు..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 641 ఆర్టీసీ బస్సులున్నా యి. వీటిలో సంస్థ సొంత వాహనాలతో పాటు అ ద్దెబస్సులు కూడా నడుస్తున్నాయి. ప్రస్తుతం రెగ్యులర్‌ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో రీజియన్‌ పరి ధిలోని 162మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితో బస్సులు నడిపేందుకు సంస్థ సమాయత్తమవుతోంది. ప్ర యాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే సమ్మెకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కూడా కలిసిరావాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. మరో వైపు ఉన్నతాధికారులు మాత్రం ఈ సిబ్బంది సమ్మెకు మద్దతు తెలపకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటికే వారి నుంచి సమ్మెలో పాల్గొనబోమని సంతకాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ సొంత బస్సులు 346

ప్రైవేట్‌ అద్దె బస్సులు 295

మొత్తం బస్సులు : 641

Advertisement
 
Advertisement
Advertisement