విధుల్లో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

Apr 22 2026 7:24 AM | Updated on Apr 22 2026 7:24 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ● మావల పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ

ఆదిలాబాద్‌రూరల్‌: విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. మావల పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. ఆవరణలో ఉన్న వాహనాలను పరి శీలించారు. పెండింగ్‌ కేసుల వివరాలు అడిగి తెలు సుకున్నారు. స్టేషన్‌ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. స్టేషన్‌కు వచ్చే బాధితుల విషయంలో గౌరవంగా వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. డయల్‌ 100 ద్వారా వచ్చే ప్రతీ కాల్‌కు స్పందించి నిమిషాల వ్యవధిలో ఘట నా స్థలాలకు చేరుకొని బాధితులకు భరోసా కల్పించాలన్నారు. ఆయన వెంట ట్రెయినీ ఐపీఎస్‌, ఎస్‌హెచ్‌వో రాహుల్‌కాంత్‌, సీఐ కర్రె స్వామి, ఎస్సై రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది, తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement