ఆదిలాబాద్‌టౌన్: రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రిమ్స్ ఆస్పత్రిని మంగళవారం సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. సిబ్బంది ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించినప్పటికీ వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తుందన్నారు. అలాగే కొంతమంది వైద్యులు అందుబాటులో ఉండడం లేదన్నారు. సమస్య పరిష్కరించేందుకు రాష్ట్రస్థాయిలో చర్చించి తగు చర్యలు చేపడతామని అన్నారు. ఆస్పత్రిలో బయో మెడికల్ వేస్టేజ్ మేనేజ్‌మెంట్ సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ వైద్య సిబ్బంది ఉన్నారు.


