బజార్‌హత్నూర్: రైతులు తాము పండించిన పంటలను మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. అనంతరం రైతువేదికలో 31మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్యాంసుందర్, పీఏసీఎస్ ఇన్‌చార్జి సంతోష్, సీఈవో నారాయణగౌడ్, సర్పంచ్ సాయన్న, నాయబ్ తహసీల్దార్ హీరాలాల్, నూర్‌సింగ్, గోవర్ధన్ రైతులు పాల్గొన్నారు.


