ఆదిలాబాద్‌టౌన్: అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేశ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫైర్‌స్టేషన్‌లో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. వారం పాటు అగ్నిమాపక సేవలను ప్రజలకు తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ముందుగా జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాకటాలతో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఫైర్ అధికారి జైత్రరాం, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


