నీటి వనరుల సంరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

నీటి వనరుల సంరక్షణ అందరి బాధ్యత

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

ఆదిలాబాద్‌: నీటి వనరుల సంరక్షణ అందరి బాధ్యత అని ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. పట్టణంలోని చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అమృత్‌ 2.0 పథకం కింద కేటా యించిన రూ.3.14కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి భూమిపూజ నిర్వహించారు. పట్టణంలోని ఖానాపూర్‌ చెరువు పునరుద్ధరణ పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వాల లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement