ఆదిలాబాద్‌టౌన్: ఆదిలా బాద్‌కు చెందిన డాక్టర్ మామిడాల ఇస్తారి అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ష్టాత్మక గుర్తింపు సాధించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ప్రముఖ శాసీ్త్రయ సంస్థ రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ ఇస్తారిని ఫెల్లో ఆఫ్ రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీకి ఎంపిక చేశారు. ఈయన ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు డీఎస్‌టీ, డీబీటీ, యూజీసీ, ఐసీఏంఆర్, రూసా సంస్థల మద్దతుతో 10 పరిశోధన ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు. 100కు పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించడంతో పాటు 22 పుస్తకాలను రచించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.


