జేఈఈలో మెరిసిన ‘గిరి’ విద్యాకుసుమాలు | - | Sakshi
Sakshi News home page

జేఈఈలో మెరిసిన ‘గిరి’ విద్యాకుసుమాలు

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

సిరికొండ: జేఈఈ మెయి న్‌–2026 రెండో సెషన్‌ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో మండలంలోని రిమ్మ గ్రామానికి చెందిన పెందూర్‌ గులబ్‌ దీప్‌ 95 పర్సంటైల్‌తో అడ్వాన్స్‌కు అర్హత సాధించాడు. ఇంటి వద్ద ఉండే పరీక్షకు సన్నద్ధం అయినట్లు తెలిపాడు. గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.

ఎస్టీ కేటగిరీలో యోగిదాస్‌ 747వ ర్యాంక్‌

బజార్‌హత్నూర్‌: మండలంలోని కాండ్లీ గ్రామానికి చెందిన జాదవ్‌ యో గిదాస్‌ నాయక్‌ జేఈఈ మెయిన్‌–2026 ఫలి తాల్లో 94.86 పర్సంటైల్‌ సాధించాడు. ఆలిండియా ఎస్టీ కేటగిరిలో 747 ర్యాంక్‌తో అడ్వాన్స్‌కు అర్హత సాధించాడు. యోగిదాస్‌ను గ్రామస్తులు అభినందించారు.

ఓటర్‌ మ్యాపింగ్‌ త్వరితగతిన పూర్తి చేయాలి

కై లాస్‌నగర్‌: ఓటరు మ్యాపింగ్‌ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ చిత్రు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించిన ఓటరు మ్యాపింగ్‌పై అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో అదనపు కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్షించారు. ఓటరు మ్యాపింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. గడువులోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో ఆర్డీవో స్రవంతి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement