మహనీయుడు బసవేశ్వరుడు | - | Sakshi
Sakshi News home page

మహనీయుడు బసవేశ్వరుడు

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

● ఎంపీ గోడం నగేశ్‌

ఆదిలాబాద్‌/ఆదిలాబాద్‌రూరల్‌: సమాజంలో కుల, వర్ణ వివక్ష రూపుమాపేందుకు వందల ఏళ్ల క్రితమే కృషి చేసిన మహానీయుడు బసవేశ్వరుడని ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. బసవేశ్వరుని జయంతి వేడుకలను జిల్లాకేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. బసవేశ్వర చౌక్‌ వద్ద ఆయన చిత్ర పటానికి, విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, సమ సమాజ స్థాపనకు బసవేశ్వరుడు చేసిన కృషిని కొనియాడారు. కా ర్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష, అదనపు కలెక్టర్‌ చిత్రు, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి సోనియా, మాజీ మంత్రి జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement