ఉట్నూర్‌రూరల్: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం తనిఖీ చేశారు. బోధనతో పాటు విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై ఆరా తీశారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్‌వో ప్లాంట్‌ను పరిశీలించారు. ఏఎన్‌ఎంలతో మాట్లాడి ఐటీడీఏ పల్స్ యాప్ పనితీరుపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట వార్డెన్, ప్రిన్సిపాల్ తదితరులున్నారు.


