ఆదిలాబాద్: దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రాష్ట్రీయ వికలాంగుల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇసాక్ అలీ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ అందించాలని, అలాగే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. మహిళా సంక్షేమ శాఖ నుంచి దివ్యాంగుల శాఖను వేరు చేసి న్యాయం చేయాలని, గ్రామీణ ప్రాంత దివ్యాంగుల పింఛన్ నేరుగా బ్యాంకుల్లో జమ అయ్యేలా చూడాలని కోరారు. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్లు పాటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మహమ్మద్ ఇమ్రాన్, ఫైసల్ అహ్మద్, శివకుమార్ పాల్గొన్నారు.


