● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్‌రూరల్: మహిళా రిజర్వేషన్ బిల్లు మా త్రమే ప్రవేశపెడితే కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, ఈ బిల్లుకు తమ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకం కాదని ఖా నాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన నివాసంలో విలేకరులతో మా ట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మహిళలు అంటే గౌరవం ఉందా.. అని ఆయన ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ చేస్తున్న తప్పుడు, దురుద్దేశ పూరిత ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. డీలిమిటేషన్ పేరుతో చిన్న రాష్ట్రాల హక్కులను దెబ్బతీసేలా, దేశ సమాఖ్య స్వరూపాన్ని బలహీనపరిచేలా బీజేపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. కార్యక్రమంలో జైవంత్ రావ్, తిరుపతి, ఆనంద్‌రావ్, భాగ్యలక్ష్మి, చంద్రయ్య, తిరుప తి, జాదవ్ జగదీశ్,లాజర్ తదితరులు పాల్గొన్నారు.


