సమ్మెకు సై.. | - | Sakshi
Sakshi News home page

సమ్మెకు సై..

Apr 20 2026 8:35 AM | Updated on Apr 20 2026 8:35 AM

● ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రి య వెంటనే ప్రారంభించాలి. ● 2021 వేతనసవరణ 30శాతం ఫిట్మెంట్‌తో పా టు 2025 వేతన సవరణను అమలు చేయాలి. ● మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ప్రతీనెల చెల్లించాలి. ● కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ● ట్రేడ్‌ యూనియన్లపై అంక్షలు ఎత్తివేసి, గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి. ● ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి. కండక్టర్‌, డ్రైవర్లపై కేఎంపీఎల్‌, ఈపీకే, వేధింపులు మానుకోవాలి. ● ఎలకి్ట్రక్‌ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. ● 2019 సమ్మె కాలంలో నమోదైన పోలీస్‌ కేసులు ఎత్తివేయాలి. ● రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలి, అలాగే అన్ని కేటగిరీల్లోని ఖాళీలను భర్తీ చేయాలి.

ఈనెల 22 నుంచి పోరుబాటలో ఆర్టీసీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ ఆందోళన అనివార్యమైతే ప్రయాణికులకు తిప్పలే..

ఆదిలాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సై అంటున్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా తమపై చిన్నచూపు చూస్తోందంటూ పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జేఏసీగా ఏర్పడి ఆందోళనకు సమాయాత్తం అవుతున్నారు. ఈ నిరసన నిరవధికంగా కొనసాగితే ప్రజా రవాణాకు ఇబ్బందులు తప్పవు. మరోవైపు ఆర్టీసీకి సైతం రూ.కోట్లల్లో నష్టం వాటిల్ల నుంది. కార్మికులతో క్షేత్రస్థాయిలో చర్చిస్తున్న అధి కారులు సమ్మె విరమింపచేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సమ్మె అనివార్యమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లవైపు కూడా దృష్టి సారిస్తున్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..

రీజియన్‌ పరిధిలో మొత్తం ఉద్యోగులు :1946

బస్సులు: 641

Advertisement
 
Advertisement
Advertisement