చిత్తశుద్ధి ఉంటే పాత బిల్లు ప్రవేశపెట్టాలి | - | Sakshi
Sakshi News home page

చిత్తశుద్ధి ఉంటే పాత బిల్లు ప్రవేశపెట్టాలి

Apr 20 2026 8:35 AM | Updated on Apr 20 2026 8:35 AM

కై లాస్‌నగర్‌: ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన పాత బిల్లు ప్రవేశపెట్టాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ నరేశ్‌జాదవ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా మహిళా రిజర్వేషన్‌ ముసుగులో డీలిమిటేషన్‌, కేంద్రప్రాంతాల సవరణ పే రిట 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చిందని ఆరోపించారు. ఎన్డీఏ సర్కారు మో సపూరితంగా బిల్లు ప్రవేశపెట్టడంతోనే కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు మూకుమ్మడిగా తిరస్కరించాయమన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ప్రధాని మోదీకి, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గతంలో ఆమోదం పొందిన మహిళల రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఇందులో పార్టీ జిల్లా అధి కార ప్రతినిధి బాలూరి గోవర్ధన్‌రెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ గౌలి సంజయ్‌కుమా ర్‌, నాయకులు గండ్రత్‌ సుజాత, అడ్డి భోజా రెడ్డి, అల్లూరి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement