ఎన్యూమరేటర్లకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఎన్యూమరేటర్లకు శిక్షణ

Apr 19 2026 7:29 AM | Updated on Apr 19 2026 7:29 AM

కై లాస్‌నగర్‌: జనగణనలో భాగంగా మే 11నుంచి ప్రారంభం కానున్న హౌస్‌లిస్టింగ్‌ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని మున్సిపల్‌ కమిషనర్‌ జి.రాజు అన్నారు. పట్టణ పరిధిలో ఈ విధులు నిర్వహించనున్న సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమం శనివారం స్థానిక టీటీడీసీలో ప్రారంభమైంది. మొత్తం 400 మందికి గాను నాలుగు బ్యాచ్‌లుగా శిక్షణనిస్తున్నారు. తొలి బ్యాచ్‌ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఎన్యూమరేటర్‌ బ్లాక్‌ పరిధిలోని ఇళ్లను పకడ్బందీగా గుర్తించాలన్నారు. ఏ ఒక్కరు తప్పిపోకుండా సర్వే చేపట్టాలన్నారు. ప్రజలు స్వతహాగా సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ కూడా చేసుకోవచ్చని ఆ దిశగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఇందులో టీపీవో సుమలత, టీపీఎస్‌ నవీన్‌ కుమార్‌, మాస్టర్‌ ట్రైనర్లు మహేందర్‌రెడ్డి, సుజాత్‌ఖాన్‌, శ్రీహరీబాబు, తిరుపతి, జలీల్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement