న్యూస్‌రీల్
ఉమ్మడి జిల్లాలో భానుడి భగభగ
రాష్ట్రంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్‌లో 44.4 డిగ్రీల సెల్సియస్‌కు చేరువ
వడగాలులతో జనం అవస్థలు
గత వారం, పది రోజులుగా ఉమ్మడి జిల్లా పరిధిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమురంభీం జిల్లాలోని సిర్పూర్–టి మండలం లోనవెల్లిలో, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్, బేలలోని చెప్రాల, బోథ్‌లోని పొచ్చెర, నిర్మల్‌లోని మామడ, కడెం, దస్తురాబాద్‌లలో 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే భైంసా, ముజ్గి, బీరవెల్లి, తలమడుగు, తానూర్‌లలో 44.2 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మెజార్టీ మండలాలు, గ్రామాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీధి వ్యాపారులు, ఉపాధి హామీ కూలీలు, అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు ఎండ తీవ్రతతో అవస్థలు పడుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురవుతున్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బ యటకు వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. టోపీ, తలపాగా, స్కార్ప్ ధరించడం, గొడుగుల సాయంతోనే బయటకు వెళ్లాలని చెబుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా శరీరం డిహైడ్రేషన్‌కు గురవుతుందని, ఈమేరకు వీలైనంత వరకు నీడపట్టునే ఉండాలని , నీళ్లు అధికంగా తాగాలని సూచిస్తున్నారు.
సోనేరావ్‌కు దళితరత్న అవార్డు
ఆదిలాబాద్‌రూరల్: దళితరత్న అవార్డు గ్రహీత కొడప సొనేరావ్‌ను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అభినందించారు. ఈనెల 14న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పలువురిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో ఆదివాసీ గిరిజనుల ను చైతన్యపరుస్తున్న సోనేరావ్ ఎంపికయ్యా రు. ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు శనివారం ఆయన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా సొనేరావ్‌ను మంత్రి శాలువాతో సత్కరించి దళిత రత్న అవార్డు అందజేసి అభినందించారు. ఆయన వెంట మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నక్క రాందాస్, కొలాం సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు టేకం లక్ష్మణ్ తదితరులున్నారు.
ఆదిలాబాద్‌టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అగ్ని గుండంగా మారింది. మూడు, నాలుగు రోజులు గా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లోని బుట్టాపూర్‌లో 44.5 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతోపాటు బేల మండల కేంద్రంలో 44.4 డిగ్రీల సెల్సియస్ నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటీవల వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో వారం పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలాగే నమోదవుతా యని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గతంతో పోల్చితే ఈసారి భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండల తీవ్రత కారణంగా ఉదయం 10 దాటిందంటే జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రాలు, గ్రామాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జనం భయటకు వెళ్లేందుకే జంకుతున్నారు. సాయంత్రం ఆరు దాటినా వడ గాలులు తగ్గడం లేదు. ఈ ప్రభావం చిన్నపిల్లలు, వృద్ధులపై పడుతుంది.
స్కార్ప్ ధరించి స్కూటీపై వెళ్తున్న మహిళ
మ్యూల్ ఖాతాలు లేకుండా చూడాలి
ఓఎల్‌ఎస్ సర్వే తర్వాత..
నమోదవుతున్న
గరిష్ట ఉష్ణోగ్రతలు..


