బాల్య వివాహాలను ప్రోత్సహించొద్దు | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలను ప్రోత్సహించొద్దు

Apr 19 2026 7:29 AM | Updated on Apr 19 2026 7:29 AM

● డీసీపీవో రాజేంద్ర ప్రసాద్‌

ఆదిలాబాద్‌టౌన్‌: బాల్య వివాహాలు ప్రోత్సహించేవారిపై కఠన చర్యలు తీసుకుంటామని జిల్లా బాల ల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్‌ అన్నా రు. జిల్లా కేంద్రంలోని బాలరక్షక్‌ భవన్‌లో పూజారులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముహూర్తాలు ఉన్నాయని వయసు చూడకుండానే పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారని, అలాంటి వాటిని ని ర్వహించవద్దన్నారు. బాల్యవివాహాలు చట్య రీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో ధూప దీప నైవేద్య సంఘం జిల్లా అధ్యక్షుడు కలవరపు లింగయ్య, ఎల్‌సీపీవో రమేశ్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కోఆర్డినేటర్‌ సతీష్‌, పీవోఐసీ ఎన్‌. స్వామి,ష్యూర్‌ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్‌ వినోద్‌ కుమార్‌, అర్చక సంఘం ప్రచార కార్యదర్శి గజానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement