కార్మికులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు న్యాయం చేయాలి

Apr 19 2026 7:29 AM | Updated on Apr 19 2026 7:29 AM

కై లాస్‌నగర్‌: సీసీఐ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఏఐటీయుసీ) నాయకులు శనివారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సెక్రెటరీ, సీసీఐ చైర్మన్‌ సంజయ్‌ బంగాను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఎంపీ గోడం నగేశ్‌ ఆధ్వర్యంలో యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ విలాస్‌, సీసీఐ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఉపాధ్యక్షుడు ఏ.నిరంజన్‌రావు చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. హైకోర్టు జడ్జిమెంట్‌ను అమలు చేయాలని, ఉద్యోగులను ఇంకా పైకోర్టుకు వెళ్లి వేధించవద్దని కోరారు. ఈ మేరకు చైర్మన్‌ స్పందిస్తూ సీఎండీతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లుగా వారు పేర్కొన్నారు. అనంతరం సీఎండీని కలిసి హైకోర్టు ఆర్డర్‌ను ఇంప్లిమెంట్‌ చేయాలని కోరారు. ఇందుకు సీఎండీ సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు. కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినట్లుగా వారు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement