ఆదిలాబాద్‌టౌన్: హిమోఫిలియో వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. శుక్రవారం రిమ్స్ కళాశాలలో ప్రపంచ హిమోఫిలియో దినో త్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో మెడికోలు, నర్సింగ్ విద్యార్థులు, వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలతో అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిమోఫిలియో జన్యుపరంగా సంక్రమించే వ్యాఽధి అన్నారు. వ్యాధి గ్రస్తులు గాయా ల బారిన పడకుండా చూసుకోవాలన్నారు. ఇందులో జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, జిల్లా అదనపు వైద్యాధికారి సాధన, వైద్యాధికారులు నరేందర్ బండారి, దీపక్ పుష్కర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


