‘కోఆప్షన్‌’ సందడి | - | Sakshi
Sakshi News home page

‘కోఆప్షన్‌’ సందడి

Apr 18 2026 7:35 AM | Updated on Apr 18 2026 7:35 AM

● నాలుగు పదవుల్లో రెండు జనరల్‌కు, రెండు మైనార్టీలకు కేటాయించారు. ● జనరల్‌కు సంబంధించి రెండింటిలో ఒకటి మహిళకు రిజర్వు చేశారు. జనరల్‌కు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు మున్సిపల్‌ పరిధిలోని ఓటరు అయి ఉండాలి. 21 ఏళ్లు నిండి ఉండాలి. మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌గా ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. అలాగే మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా మూడేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉన్నవారు అర్హులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల్లో గెజిటెడ్‌ పోస్టులో పనిచేసి విరమణ చేసిన వారు, మున్సిపల్‌ పరిధిలో అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ● మైనార్టీ వర్గానికి కేటాయించిన రెండింటిలో ఒకటి మహిళకు రిజర్వ్‌ చేశారు. వీరు కూడా మున్సిపల్‌ పరిధిలోని ఓటరు జాబితాలో పేరు కలిగి ఉండాలి. 21 ఏళ్లు నిండి ఉండాలి.

మున్సిపల్‌లో నలుగురు సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ కై వసం చేసుకునేందుకు కూటమి దృష్టి చెరో రెండు పదవులపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పట్టు

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌లో కోఆప్షన్‌ సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. న లుగురిని ఎన్నుకునేందుకు గాను కమిషనర్‌ జి. రాజు శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. అర్హులైన వారి నుంచి ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీ కరించనున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. కై వసం చేసుకునేందుకు చైర్‌పర్సన్‌ ఎన్నిక సమయంలో మాదిరిగానే స్వతంత్రులతో కలిసి కాంగ్రెస్‌, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌లు కూ టమి కట్టే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ సైతం పోటీ పడనున్నట్లుగా తెలుస్తోంది. ఆశావహులు ఆయా పార్టీల ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునేలా పడ్డారు. ఈ నేపథ్యంలో సభ్యుల ఎంపిక ఏకగ్రీవం అవుతుందా.. లేదా ఎన్నిక అని వార్యం కానుందా అనేది ఆసక్తికరంగా మారింది.

పదవులపై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దృష్టి

నాలుగు కోఆప్షన్‌ పదవులు భర్తీ చేయనుండగా ఇందులో రెండు మహిళలకు కేటాయించారు. చెరో రెండు పదవులు దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లు భావిస్తున్నాయి. ఆయా పా ర్టీల తరఫున ఎవరిని బరిలో నిలపాలనే దానిపై ఇప్పటికే ప్రాథమికంగా అభ్యర్థులను ఎంపిక చేశా యి. అయితే వారి వివరాలతో కూడిన జాబితాను జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వద్దకు తీసుకెళ్లి ఆమోదముద్ర వేయించేలా ప్రయత్నిస్తున్నారు. చైర్‌పర్సన్‌ ఎన్నిక వ్యూహాన్నే ఈ పదవుల భర్తీలోనూ అనుసరించాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకోసం స్వతంత్రులు, ఎంఐఎం కౌన్సిలర్లతో కలిసి కూటమిని ఏర్పాటు చేయనున్నారు. దీనిపై డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌ జాదవ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, ఎంఐఎం యాకత్‌పూర ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మెహ్రజ్‌లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లిని త్వరలోనే హైదరాబాద్‌లో కలిసి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లుగా సమాచారం. అయితే ఈ పదవుల కోసం బీజేపీ కూడా పోటీ పడే అవకాశమున్నట్లుగా సమాచారం. మెజార్టీ లేనప్పటికీ ఆ పార్టీ అభ్యర్థులను బరిలో నిలపాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లుగా తెలిసింది.

అర్హతలేంటంటే..

25 వరకు దరఖాస్తుల స్వీకరణ

అర్హులైన అభ్యర్థులు ఈ నెల 25 సాయంత్రం ఐదు గంటల్లోపూ మున్సిపల్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కమిషనర్‌ సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంఽధిత అర్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జతచేయాలని పేర్కొన్నారు. సంబంధిత నోటిఫికేషన్‌ను మున్సిపల్‌ కార్యాలయ నోటీసుబోర్డుపై అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement