ఆదిలాబాద్‌టౌన్: ప్రమాద సందర్భాల్లో బాధితుల ప్రాణాలు కాపాడడంలో సీపీఆర్ కీలకపాత్ర పోషి స్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో డయల్ 100, బ్లూకోర్ట్, స్పెషల్ పార్టీ, ఏఆర్ సిబ్బందికి సీపీఆర్, ఫస్ట్‌ఎయిడ్‌పై శిక్షణ నిర్వహించారు. రిమ్స్‌కు చెందిన అనస్తీషియా వైద్యులు పాల్గొని శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’గా పరిగణిస్తారని, ఆ సమయంలో తక్షణ వైద్యసాయం అందిస్తే ప్రాణాలను రక్షించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అన్నా రు. రోడ్డు ప్రమాదాలను గమనించిన వెంటనే స్పందించి బాధితులను సమీప ఆస్పత్రికి తరలించడం ప్రతిఒక్కరు బాధ్యతగా భావించాలని సూచించారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి చేర్చిన వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రహ వీర్’ పథకం ద్వారా నగదు బహుమతి అందజేస్తారని తెలిపారు. అలాగే ప్రమాద బాధితులకు సమీప ఆస్పత్రిలో రూ.1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స అందుబాటులో ఉంటుందని చెప్పారు. ట్రా ఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం, హెల్మె ట్, సీట్‌బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరి చేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా సీపీఆర్, ఫస్ట్‌ఎయిడ్ శిక్షణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు, ఆర్‌ఐలు, రిజర్వ్ సిబ్బంది, రిమ్స్ అనస్తీషియా డాక్టర్ శ్యామ్‌సుందర్, డాక్టర్ గంగాధర్, డాక్టర్ వివేక్, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


