ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు పూర్తి సహకారం | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు పూర్తి సహకారం

Apr 18 2026 7:35 AM | Updated on Apr 18 2026 7:35 AM

● ఇన్‌చార్జి కలెక్టర్‌ యువరాజ్‌

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని ఇన్‌చార్జి కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, ఎయిర్‌ఫోర్స్‌ అధికారులతో కలిసి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదిలాబాద్‌లో పూర్తిస్థాయి ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలి పారు. దీని ద్వారా శిక్షణ కేంద్రం, రక్షణ రంగానికి సంబంధించిన కార్యకలాపాలు ఆదిలాబాద్‌ నుంచే కొనసాగనున్నాయని చెప్పారు. త్వరలో ఢిల్లీ లో నిర్వహించనున్న జాయింట్‌ మీటింగ్‌లో తుది నిర్ణయంపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మె ల్యే శంకర్‌ మాట్లాడుతూ, విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కీలక అడుగులు పడుతున్నాయని, ఇది జిల్లాకు శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. ఇందులో అదనపు కలెక్టర్‌ ఆర్‌ఎస్‌.చిత్రు, ఆర్డీవో స్రవంతి, ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement