బీజేపీ ఎంపీ తీరుపై కాంగ్రెస్‌ నిరసన | - | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీ తీరుపై కాంగ్రెస్‌ నిరసన

Apr 18 2026 7:35 AM | Updated on Apr 18 2026 7:35 AM

కై లాస్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అపహాస్యం చేస్తూ పాకిస్తాన్‌ విభజనతో పోల్చిన బీ జేపీ ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు డా క్టర్‌ నరేశ్‌జాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఎంపీ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్‌చౌక్‌లో ఆ పా ర్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి చెంది న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయనతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కిసాన్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ శ్రీ కాంత్‌రెడ్డి, నాయకులు సాజిద్‌ ఖాన్‌, సుజాత, సంజీవ్‌ రెడ్డి, సంజయ్‌, రూపేష్‌రెడ్డి, మంగేష్‌, కౌన్సిలర్‌ చరణ్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement