లైఫ్‌ సేవర్స్‌గా పోలీసులు, వైద్యులు | - | Sakshi
Sakshi News home page

లైఫ్‌ సేవర్స్‌గా పోలీసులు, వైద్యులు

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

● అడిషనల్‌ డీజీపీ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ● జిల్లా కేంద్రంలో అవగాహన సదస్సు

ఆదిలాబాద్‌టౌన్‌: వైద్యులు, పోలీసులు లైఫ్‌ సేవర్స్‌గా ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నారని గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ ఆపరేషన్‌ అడిషనల్‌ డీజీపీ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భా గంగా అరైవ్‌–అలైవ్‌ పేరిట గురువారం పట్టణంలో ని రిమ్స్‌ ఆడిటోరియంలో నిర్వహించిన రోడ్డు సేఫ్టీ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 25మంది డ్రైవర్లకు ఉచితంగా కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ వినియోగంపై వాహనదారుల్లో మరింత అవగాహన పెంపొందించాలని సూచించారు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలి పారు. అనంతరం ద్విచక్రవాహనాలపై వెనుక కూ ర్చుని వెళ్తున్న ఇద్దరు పిల్లలకు హెల్మెట్లు ధరింపజేశారు. కార్యక్రమంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, అడిషనల్‌ ఎస్పీ మౌనిక, ట్రైనీ ఐపీఎస్‌ రాహుల్‌ కాంత్‌, డీఎస్పీలు శ్రీనివాస్‌, జీవన్‌రెడ్డి, వైద్యులు, సీఐలు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రమాద సూచికలు ప్రారంభం

గుడిహత్నూర్‌: అరైవ్‌–అలైవ్‌లో భాగంగా అదనపు డీజీపీ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ స్థానిక శర్మ దాబా వద్ద ఏర్పాటు చేసిన ప్రమాద సూచికలను ఎస్పీ అఖిల్‌ మహాజన్‌తో కలిసి ప్రారంభించారు. గతంలో ప్రమాదానికి గురై తీవ్రంగా దెబ్బతిన్న కారును వా హనదారులకు కనిపించేలా ఏర్పాటు చేశారు. దీని ని ప్రారంభించిన అదనపు డీజీపీ ప్రభుత్వ ఆమోదిత రేడియం స్టిక్కర్లను లారీలకు అతికించారు. అదనపు ఎస్పీ మౌనిక, శిక్షణ ఐపీఎస్‌ రాహుల్‌కాంత్‌, డీఎస్పీలు శ్రీనివాస్‌, జీవన్‌రెడ్డి, హైవే నిర్వహణ సంస్థ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ శివకుమార్‌, ఇచ్చోడ సీఐ రమేశ్‌, ఎస్సై శ్రీకాంత్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement