ఇంద్రవెల్లి: గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని, గ్రామాలాభివృద్ధికి కృషి చేయాలని సర్పంచులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం నిర్వహించిన సమావేశానికి హాజరైన అధికారులను వివిధ సమస్యలపై ఆయా గ్రామాల సర్పంచులు మెస్రం తుకారాం, కోవా రాజేశ్వర్, చంగోనదుది రాం, రాథోడ్ రోహిదాస్, జాదవ్ లఖన్‌తోపాటు మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండీ మసుద్, మీర్జా జిలానీబేగ్ నిలదీశారు. వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన ప్రత్యేక అ ధికారి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ.. అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజల కోసం పని చేయాలని, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని గ్రామాలాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎస్సై సాయన్న, ఎంపీడీవో జీవన్‌రెడ్డి, ఏవో రాథోడ్ గణేశ్, విద్యుత్ శాఖ ఏఈ రోహిదాస్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ భానుకుమార్, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం తదితరులున్నారు.


