సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలి

Apr 17 2026 11:02 AM | Updated on Apr 17 2026 11:02 AM

ఉట్నూర్‌రూరల్‌: ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌ సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని స్టార్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మండల ప్రగతి నివేదిక చదివి వినిపించారు. సర్పంచ్‌ జాదవ్‌ అనిత శ్రీనివాస్‌, మండల ప్రత్యేకాధికారి నర్సయ్య, తహసీల్దార్‌ రఘునాథ్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement