రహదారి నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

రహదారి నిబంధనలు పాటించాలి

Apr 16 2026 12:47 PM | Updated on Apr 16 2026 12:47 PM

● ప్రజా భాగస్వామ్యంతోనే ప్రమాదాల నివారణ ● రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

ఆదిలాబాద్‌/కైలాస్‌నగర్‌:ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని, ప్రజాభాగస్వామ్యం తోనే ప్రమాదాల నివారణ సాధ్యం అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రవా ణాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ‘అరైవ్‌.. అలైవ్‌’ అవగాహన కార్యక్రమంలో పాల్గొని మా ట్లాడారు. ట్రాఫిక్‌ నిబంధనలపై నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపా రు. ఇందులో చనిపోతున్న వారిలో 25 నుంచి 40ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉండటం విచారకరమన్నారు. పలువురు డ్రైవర్లకు కళ్లద్దాలు, యువతకు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, రహదారి భద్రతపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కా ర్యక్రమంలో భాగంగా హెల్మెట్‌ సేవ్స్‌ లైవ్స్‌ అంటూ విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం గాంధీ పార్కు నుంచి అంబేద్కర్‌ చౌక్‌ వరకూ ఏర్పాటు చేసిన బైక్‌ ర్యాలీలో మంత్రి ఉత్సాహంగా పాల్గొన్నారు.

చిన్నారులతో ముచ్చటించి.. సూచనలు తెలిపి

హాజరైన చిన్నారులను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమం ఉద్దేశం గురించి ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఓ చిన్నారికి హెల్మెట్‌ పెట్టి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ వికాస్‌రాజ్‌, ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌, వెడ్మ బొజ్జు పటేల్‌, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, ఐటీడీఏ పీవో యువరాజ్‌ మ ర్మాట్‌, అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, డిప్యూటీ ట్రా న్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పి.రవీందర్‌ కుమార్‌, ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లెపూల నర్సయ్య, డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్‌, డీసీసీ అధ్యక్షుడు నరేష్‌జాదవ్‌, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్‌రెడ్డి, ఎంవీఐ ఎస్‌.శ్రీనివాస్‌, ఏఎంవీఐ కె.హరేంద్ర కుమార్‌ పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన అవసరం

ఆదిలాబాద్‌రూరల్‌: రహదారి నిబంధనలపై చి న్నతనం నుంచే అవగాహన కలిగి ఉండాలని మంత్రి పొన్నం అన్నారు. మావల మండలంలో ని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా ఏర్పా టు చేసిన చిల్డ్రన్‌ ట్రాఫిక్‌ అవేర్నెస్‌ పార్క్‌ను ప్రా రంభించి మాట్లాడారు. ఈ పార్క్‌ ద్వారా విద్యార్థులు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, రోడ్డు గుర్తులపై ప్రత్యక్షంగా అవగాహన పెంచుకోవచ్చన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement