ఆదిలాబాద్‌టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో రానున్న ఐదు రోజుల పాటు భాను డు తన ప్రతాపం చూపనున్నాడు. ఈ నెల 15 నుంచి 19వరకు ఉత్తర తెలంగాణలోని ఆదిలా బాద్, నిర్మల్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజ న్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో వడగాలులతో పాటు గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ హె చ్చరించింది. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యాహ్న సమయంలో బయట తిరుగవద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు.


