నిర్మల్‌ఖిల్లా: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో నిర్మల్ జిల్లాకు చెందిన ఓ యువతి కువైట్‌లో చిక్కుకుంది. స్వదేశానికి తిరిగి రావడంలో ఆమెకు అనేక సమస్యలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి స్పందించి కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఉన్నతాధికారులతో మాట్లాడి, యువతి సురక్షితంగా భారత్‌కు చేరుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయించారు. ఎమ్మెల్యే చొరవతో సమస్య పరిష్కారం కావడంతో బాధిత యువతి కుటుంబ సభ్యులు శ్వేత, మధు బుధవారం జిల్లా కేంద్రంలో ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


