వాంకిడి: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చిన్నపుల్లార గ్రామానికి చెందిన కుమురం వెంకటేష్ (16), గాగ్రు అనే మరో పదేళ్ల బాలుడు మధ్యాహ్నం చౌపన్‌గూడ వైపు నుంచి వాంకిడి వైపు వెళ్తున్న ట్రాక్టర్‌పై ఎ క్కారు. చిన్న పుల్లార గ్రామ సమీపంలో చెరువు కల్వర్టు వద్దకు చేరుకోగానే అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. గాగ్రు, డ్రైవర్ భీంరావు పక్కకు పడిపోగా వెంకటేష్ మాత్రం ట్రాక్టర్ కింద ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ ఆత్రం భీంరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


