చెన్నూర్: మాది చెన్నూర్ మండలంలోని ఎల్లక్కపేట. బుడిగ జంగాలోల్లం. మాది నిరుపేద కుటుంబం. టీవీలు, సోషల్ మీడియా ప్రభావంతో కులవృత్తికి ఆదరణ తగ్గింది. కుటుంబ పోషణకు మా తల్లిదండ్రులు వెంకటేశ్, విజయ ఊరూరా తిరిగి అల్లం, ఎల్లిగడ్డలు విక్రయిస్తున్నారు. ఇంటర్ సెకండియర్ బైపీసీలో 985 మార్కులు సాధించా. నాకు డాక్టర్ చదవాలని ఉన్నప్పటికీ కుటుంబ ఆర్థిక స్థోమత కారణంగా నీట్‌కు దరఖాస్తు చేసుకోలేక పోయా. ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేశా. అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలని ఉంది. వ్యవసాయ శాఖలో ఉద్యోగం సంపాదించి రైతులకు సేవలందించాలని ఉంది.


