తాండూర్: మండలంలోని కిష్టంపేట ఎస్సీ కాలనీలో మంగళవారం రాత్రి రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. కిష్టంపేట ఎస్సీ కాలనీకి చెందిన మోటం దేవేందర్ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి తన ఇంట్లో నిల్వ ఉంచాడు. తమకు అందిన సమాచారం మేరకు దేవేందర్ ఇంటికి వెళ్లి తనిఖీ చేసి సుమారు 18 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించినట్లు తెలిపారు.


