కాసిపేట: తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశా. ప్రథమ సంవత్సరంలో 467 మార్కులతో థర్డ్ ర్యాంకు సాధించా. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 992 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించా. మా నాన్న కొమ్మల సంతోష్ ఓరియంట్ సిమెంట్ కంపనీలో లోడింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఎంసెట్‌కు ప్రిపేర్ అవుతున్నా. భవిష్యత్‌లో గ్రూప్స్‌కు ప్రిపేరై ప్రజాసేవ చేసే ఉద్యోగం సాధిస్తా. ఏ మార్గం ఎంచుకున్నా గ్రూప్స్ లక్ష్యంగా ముందుకెళ్తా. – కొమ్మల స్వతంత్ర


