చింతలమానెపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌వో పోచయ్య తెలిపారు. కాగజ్‌నగర్‌కు చెందిన గొడిసెల రామాగౌడ్(67) బుధవారం బాబాసాగర్ నుండి కాగజ్‌నగర్ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కాగజ్‌నగర్ నుంచి డబ్బా వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఘటనలో రామాగౌడ్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌హెచ్‌ఓ వివరించారు.
చికిత్స పొందుతూ యువకుడు..
ఉట్నూర్‌రూరల్: మండలంలోని హర్కాపూర్ సమీపంలో మంగళవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో సాలెగూడకు చెందిన టేకం తులసీరాం (25) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ఆత్రం ఉదయ్ కిరణ్ (19)ను ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు స్థానిక పులాజీ బాబా కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు ఆత్రం భీంరావు, తల్లి లలిత కన్నీరుమున్నీరుగా విలపించారు.
డీఅడిక్షన్ కేంద్రానికి ఇద్దరి తరలింపు
చెన్నూర్: పట్టణానికి చెందిన ఇంటర్ విద్యార్థి, మరో బాలుడు గంజాయికి బానిసైనట్లు గుర్తించి డీఅడిక్షన్ కేంద్రానికి తరలించినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. కొంతకాలంగా గంజాయికి అలవాటు పడిన ఇద్దరు విద్యార్థులు మహారాష్ట్ర, చంద్రపూర్, బల్లార్ష నుంచి గంజాయి కొనుగోలు చేసి చెన్నూర్ ప్రాంతంలో సేవిస్తున్నట్లు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఇద్దరికి వైద్యుల సమక్షంలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రిపోర్టు వచ్చిందన్నారు. ఇరువురిని మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టి మంచిర్యాలలోని డీఅడిక్షన్ కేంద్రానికి తరలించినట్లు సీఐ తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనించి పోలీసులకు సమాచారం ఇస్తే కౌన్సెలింగ్ ఇస్తామని, మార్పు రాకపోతే డీఅడిక్షన్ సెంటర్‌కు తరలిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు పోలీసులకు సహకరించాలని సీఐ కోరారు.


