మాతృభాష, సంస్కృతిని కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మాతృభాష, సంస్కృతిని కాపాడుకోవాలి

Apr 16 2026 10:18 AM | Updated on Apr 16 2026 10:18 AM

● ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌

ఉట్నూర్‌రూరల్‌: మాతృభాష, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీఎంఆర్సీలో ఉట్నూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో గిరిజన అభివృద్ధి, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ, సుస్థిర అభివృద్ధి కోసం సమగ్ర వ్యూహాలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గిరిజనులు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ పరంగా అభివృద్ధి సాధించాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. ఆయా రాష్ట్రాల ప్రముఖ విద్యా సంస్థల ప్రొఫెసర్లు రాంబో, మాయాదేవి, ప్రియాంక, విజయ్‌ కుమార్‌, అనిల్‌ కుమార్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదిలాబాద్‌, ఇచ్చోడ, నిర్మల్‌ ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ జాదవ్‌ సంగీత, డాక్టర్‌ శ్రీనివాస్‌, సుధాకర్‌ మాట్లాడారు. నేటి ప్రపంచంలో నేటి ప్రపంచంలో సంకల్పబలం ఉంటేనే ఏదైనా సాధించవచ్చన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ టి.ప్రతాప్‌సింగ్‌, ఉట్నూర్‌ సర్పంచ్‌ జాదవ్‌ అనిత శ్రీనివాస్‌, మెస్రం మనోహర్‌, దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన ప్రొఫెసర్లు, రీసెర్చ్‌ అభ్యర్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement