‘ఇందిరమ్మ’పై అదనపు భారం | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’పై అదనపు భారం

Apr 15 2026 7:38 AM | Updated on Apr 15 2026 7:38 AM

యుద్ధ ప్రభావంతో పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు టన్ను స్టీల్‌ ధర రూ.7వేలు అప్‌ సిమెంట్‌ బస్తాపై రూ.20 పెంపు లబోదిబోమంటున్న లబ్ధిదారులు

కై లాస్‌నగర్‌: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇందిరమ్మ ఇళ్లపై పడింది. నిర్మాణాలకు అవసరమైన స్టీల్‌, సిమెంట్‌ ధరలు నెల వ్యవధిలోనే భారీగా పెరి గాయి. ఒక్కో ఇంటిపై సుమారు రూ.25వేల వరకు అదనపు భారం పడుతుండడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్ర ణాళిక కార్యాచరణలో భాగంగా వచ్చే ఏప్రిల్‌, జూన్‌ మాసాల్లో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పెరిగిన సామగ్రి ధరలతో నిర్మాణాలు మందగించే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వమిచ్చే మొత్తం సరిపోకపోవడంతో లబ్ధిదారులు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నెల వ్యవధిలోనే...

ఇందిరమ్మ లబ్ధిదారులకు స్థానికంగా లభించే ఇసు క లభ్యతే ఇబ్బందికరంగా మారగా పెరిగిన స్టీల్‌, సిమెంట్‌ ధరలు అదనపు భారం కానున్నాయి. ట్రా క్టర్‌ ఇసుక ధర రూ.5వేల నుంచి రూ.6వేలు పలుకుతుంది. ఇసుక ఉచితంగా అందజేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పెన్‌గంగ పరీవాహక ప్రాంతాల నుంచి తెచ్చుకునేందుకు ట్రాక్టర్‌, లేబర్‌ చార్జీ అదనపు భారమవుతున్నాయి. నెల క్రితం వరకు రూ.62వేలు ఉన్న టన్ను స్టీల్‌ ధర ప్రస్తుతం రూ.70 వేలకు చేరింది. అలాగే సిమెంట్‌ బస్తా ధర మొన్న టి వరకు రూ.280 ఉండగా ప్రస్తుతం రూ.300కు చేరింది.యుద్ధం కారణంగా స్టీల్‌, సిమెంట్‌ సరఫరా పూర్తిస్థాయిలో జరుగకపోవడం, ఇంధనకొరత నేపథ్యంలోనే ఈధరలు పెరిగినట్లుగా వ్యాపారులు చె బుతున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే మరింత పెరిగే అవకాశమున్నట్లుగా అభిప్రాయపడుతున్నా రు. కాగా ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సగటున రెండు టన్నుల స్టీల్‌, 200 బస్తాల సిమెంట్‌ అవసరం కానున్నట్లుగా అధికారులు చెబుతున్నా రు. ఈలెక్కన స్టీల్‌పై రూ.16వేలు,సిమెంట్‌పై మరో రూ.4వేల చొప్పున రూ.20వేల వరకు అదనపు భా రం పడుతున్నట్లుగా లబ్ధిదారులు చెబుతున్నారు. వీటితో పాటు ఇంటి తుది పనుల్లో వినియోగించే పీవీసీ పైపుల ధరలు సైతం 40శాతం పెరిగినట్లుగా పేర్కొంటున్నారు. వీటిపై సుమారు రూ.10వేల వరకు అదనపు భారం కానుంది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారుపై రూ.30వేల అదనపు భారం పడి నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

అప్పులు చేయాల్సిందే..

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తుంది. పనులు సా గిన కొద్ది బిల్లులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నాలుగు విడతల్లో జమ చేస్తుంది. నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు ప్రభుత్వమిచ్చే నగదకు మరి కొంత జోడించి పనులు చేపడుతున్నారు. అయితే పెరిగిన సామగ్రి ధరలతో లబ్ధిదారులపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే ఆర్థికస్థోమత లేకపోవడం, స్వయం సహాయక సంఘాల ద్వారా అందించే ఆర్థికసాయం సకాలంలో అందకపోవడం వంటి కారణాలతో నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో నిర్మాణాలు పూర్తిచేయలేని పరిస్థితి ఏర్పడనుందనే అభిప్రా యం వ్యక్తమవుతోంది.

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు ...

మంజూరైనవి:16,093

ఇప్పటి వరకు పూర్తయినవి:404

ప్రారంభం కానివి:2,099

మార్కౌట్‌ ఇచ్చినవి:2,235

వివిధ దశల్లో కొనసాగుతున్నవి:11,355

జైనథ్‌ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన కుడ్మెత కంసుల పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. స్లాబ్‌ లెవల్‌ వరకు నిర్మాణం పూర్తి కాగా రూ.4లక్షల వరకు ఖర్చు చేసింది. లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా ప్రస్తుతం ట్రాక్టర్‌ ఇసుకకు రూ. 6వేలకు వెచ్చించాల్సి వస్తోందని ఈమె చెబుతోంది. అలాగే స్టీల్‌, సిమెంట్‌ ధరలు పెరగడంతో నిర్మాణ పనులు పూర్తి చేయాలంటే అప్పు తప్పడం లేదని వాపోతోంది.

Advertisement
 
Advertisement
Advertisement