● జిల్లాలో 42.8 డిగ్రీ సెల్సియస్ ● నిప్పుల కొలిమిగా మారిన వైనం ● నిర్మానుష్యంగా ప్రధాన కూడళ్లు ● ఎండవేడిమి తాళలేక జనం ఇక్కట్లు
భానుడి
నిర్మానుష్యంగా జిల్లాకేంద్రంలోని తెలంగాణచౌక్
కై లాస్‌నగర్: భానుడి ప్రతాపంతో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ రెండో వారంలోనే పగటి ఉ ష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరువవుతున్నాయి. ఈ సీజన్‌లో మంగళవారం అత్యధికంగా 42.8డిగ్రీ సె ల్సియస్‌గా నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధిక పగ టి ఉష్ణోగ్రతల్లో జిల్లా రెండో స్థానంలో నిలువడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఉదయం 11 గంటల నుంచే వడగాలులు మొదలవుతున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రోడ్లు, ప్రధాన కూడళ్లునిర్మానుష్యంగా మా రుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నందని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉద్యోగులు, కూలీలు, చిరు వ్యాపారులు ఇతరత్రా అత్యవసర పనుల్లో బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
ఇళ్లకే పరిమితమవుతున్న జనం
ఎండ తీవ్రత తట్టుకోలేక జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటి కొనుగోళ్లు పెరిగాయి. పేదవాడి ఫ్రిజ్‌గా పేరొందిన రంజన్లకు గిరాకీ పెరిగింది. ఎండలో బయటకు వెళ్లే వారు శీతలపానియాలు, కొబ్బరి బోండాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు.


