సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Apr 15 2026 7:38 AM | Updated on Apr 15 2026 7:38 AM

నేరడిగొండ: కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ప్ర జా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి ‘పండిత్‌ దీన్‌ దయాళ్‌ ప్రశిక్షణ మహా అభియాన్‌’ శిక్షణ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. మండల కేంద్రంలో బీజేపీ మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానందంతో కలి సి ఆయన హాజరై మాట్లాడారు. పండిత్‌ దీన్‌ దయాళ్‌ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందులో జిల్లా కార్యదర్శి శంకర్‌, ప్రధానకార్యదర్శి మాధవ్‌రావు ఆమ్టే, ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బాబా రావు పటేల్‌, మండల అధ్యక్షుడు రాజశేఖర్‌, రాజు, జీవీ రమణ, రమేశ్‌, రాజేశ్వర్‌, రంజిత్‌, గంగిరెడ్డి, నరేంద్ర, మహేందర్‌, పరుశురాం, పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement