కై లాస్‌నగర్: ప్రతి ఒక్కరూ అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ నెల 14 నుంచి నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన ప్రచార పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డి.జయరాం, ఎల్‌ఎఫ్‌ఎఫ్‌టి సుంగన్న, ఎఫ్‌ఎఫ్‌టి ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


