ఆదిలాబాద్‌టౌన్: జాతీయ లోక్ అదాలత్‌కు భారీ స్పందన లభించిందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం మాట్లాడారు. జిల్లాలో ఈనెల 28న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 423 ఎఫ్‌ఐఆర్‌లు, 1017 ఈ–పెట్టి కేసులు, 3,812 డ్రంకెన్ డ్రైవ్ కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. 49 సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు కోర్టు ద్వారా రూ.9లక్షల 95వేల 846 తిరిగి చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. 147 ఎకై ్సజ్ కేసులకు గాను రూ.7లక్షల 35వేల జరిమానా విధించినట్లు చెప్పారు. కక్షిదారులు రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవడం అభినందనీయమని అన్నారు. ఇందులో కోర్టు డ్యూటీ అధికారుల పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. లోక్ అదాలత్ విజయవంతం కోసం కృషి చేసిన జిల్లా జడ్జి ప్రభాకర రావు, న్యాయ సేవాధికార సంస్థ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.


