కై లాస్‌నగర్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న చిల్కూరి రామచంద్రారెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతారని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అ నూష అన్నారు. మాజీ మంత్రి సీఆర్‌ఆర్ జ యంతిని జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. పార్టీ నా యకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై సీఆర్‌ఆర్ చిత్రపటానికి పూ లమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను స్మరించుకుని కొనియాడారు. కార్యక్రమంలో సీఆర్‌ఆర్ సోదరుడు చిల్కూరి లక్ష్మారెడ్డి, నాయకులు సంజీవ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


