ఆదిలాబాద్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఆదిలా బాద్ ఆర్టీసీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక తలంబ్రాల బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్‌బోర్డు కాలనీలో గల శ్రీకోదండ రామాలయంలో శుక్రవారం ఈ కౌంటర్‌ను కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఒక్కో ప్యాకెట్‌కు రూ.151 చెల్లించి బుక్ చేసుకుంటే, రెండు ముత్యాలతో కూడిన తలంబ్రాల ప్రసాదాన్ని భక్తుల ఇంటికే నేరుగా చేరవేసేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో కౌన్సిలర్లు ఈ.సుష్మ, లాలామున్నా, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


