ఆదిలాబాద్: జిల్లాలో శుక్రవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ గాలులతో కూడిన అ కాల వర్షం కురిసింది. పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏ ర్పడింది. జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో ని ప్పురవ్వలు ఎగిసిపడగా నవమి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన టెంట్‌పూర్తిగా కాలిపోయింది. స్థాని కులు అప్రమత్తమై ఆర్పివేయడంతో పెను ప్రమా దం తప్పింది. అలాగే గాలివాన ధాటికి కలెక్టరేట్ చౌరస్తాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. గాలులు వీచడం ఆగిన తర్వాత తేలికపాటి వర్షం కురిసి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.


