శోభాయాత్రలో నృత్యం చేస్తున్న చిన్నారులు
మంగళహారతులతో మహిళలు
హరే రామ.. హరే కృష్ణ నామస్మరణతో గురువారం జిల్లా కేంద్రంలోని వీధులన్నీ మార్మోగాయి. భజన, కీర్తనలు, భక్తి గీతాలాపన, నృత్యాలతో పురవీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా స్థానిక మధుర జిన్నింగ్ మిల్లు నుంచి ప్రారంభమైన పల్లకి శోభాయాత్ర రాంపూర్‌లోని ఇస్కాన్ ఆలయం వరకు కన్నుల పండువగా సాగింది. సీతారాములు పల్లకీ సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. శోభా యాత్రలో భాగంగా భక్తులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష పూజలు చేశారు. ప్రణవానందస్వామి, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. – ఆదిలాబాద్


