మహిళలకు అండగా ‘పోలీస్‌ అక్కా’ | - | Sakshi
Sakshi News home page

మహిళలకు అండగా ‘పోలీస్‌ అక్కా’

Mar 27 2026 8:45 AM | Updated on Mar 27 2026 8:45 AM

ఆదిలాబాద్‌టౌన్‌: మహిళలకు అండగా ‘పోలీస్‌ అక్కా’ వ్యవహరిస్తున్నట్లు ఎస్పీ అఖిల్‌ మహాజ న్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ‘పోలీస్‌ అక్కా’ సిబ్బందితో సమావేశమై మా ట్లాడారు. ఈ సంవత్సరం 17 బాల్య వివాహా లు నిలిపివేసినట్లు తెలిపారు. నెల వ్యవధిలో 131 అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ట్లు, 60 గ్రామాలను సందర్శించినట్లు వివరించారు. మహిళలు వేధింపులకు గురైతే ‘డయల్‌ 100’ లేదా షీటీమ్‌ను 87126 59953 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. ఉత్తమ ప్ర తిభ కనబర్చిన సిబ్బందిని ప్రశంసాపత్రాలతో అభినందించారు. మహిళా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌, షీటీమ్‌ బృందం ఏఎస్సై సుశీల, హెడ్‌కానిస్టేబుల్‌ వాణిశ్రీ ఉన్నారు.

ప్రమాదాల నివారణే లక్ష్యం

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యమని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ‘అరైవ్‌.. అలైవ్‌’లో భాగంగా ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లపై స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌, సీట్‌బెల్టు ధరించాలని సూచించారు.

నేరాల నియంత్రణకు నాకాబందీ

నేరాల నియంత్రణకు బుధవారం రాత్రి 9నుంచి 12గంటల వరకు నాకాబందీ నిర్వహించిన ట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. జిల్లాలో ని సరిహద్దు ప్రాంతాల్లో ఏకకాలంలో 28 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడు తూ.. జిల్లా వ్యాప్తంగా 41 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 13 నంబర్‌ ప్లే ట్లు లేని వాహనాలు, మూడు ధ్రువపత్రాలు లే ని ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, ఒక కారు, ఒక కంటైనర్‌ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జైనథ్‌లోని పిప్పర్‌వాడ చెక్‌పో స్టు వద్ద అక్రమంగా రెండు వాహనాల్లో పశువులను తరలిస్తుండగా సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఉట్నూర్‌ ఏఎస్పీ రుత్విక్‌ సాయి, ఆదిలాబాద్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి, మావల ఎస్‌హెచ్‌వో రాహు ల్‌ కాంత్‌, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement