శోభాయాత్రకు తరలిరండి | - | Sakshi
Sakshi News home page

శోభాయాత్రకు తరలిరండి

Mar 26 2026 7:37 AM | Updated on Mar 26 2026 7:37 AM

ఆదిలాబాద్‌: శ్రీరామనవమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర మఠం నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న శ్రీ భవ్య రామ శోభాయాత్రను జయప్రదం చేయాలని ఉత్సవ సమితి అధ్యక్షులు రాళ్లబండి మహేంద్ర కోరారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మాట్లాడారు. హిందువుల ఐక్యతను చాటి చెప్పడానికి, హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను ఖండించడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమితి నాయకులు మహేందర్‌, సురేందర్‌, మనోజ్‌ పవర్‌, సచిన్‌, చాణక్య, అభియాదవ్‌, స్వప్నిల్‌, కిరణ్‌, సంతోష్‌, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement